WGL | కొత్తూరులో కారు దగ్ధం..

తాడ్వాయి, ఆంధ్రప్రభ : తాడ్వాయి మండలం కొత్తూరు గ్రామ శివారులో అనుమానాస్పదంగా కారు దగ్ధమైన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది.

మేడారం సమ్మక్క–సరళమ్మ దర్శనానికి వచ్చిన వెంకటాపురం మండలం లక్ష్మిదేవీపేట గ్రామానికి చెందిన బాలరాజు తన కారును కన్నెపల్లి క్రీడా ప్రాంగణంలో పార్క్ చేసి భోజనానికి వెళ్లిన‌ట్టు తెలిపాడు.

కొద్ది సేపటికే కారులో మంటలు చెలరేగడంతో అక్కడున్నవారు అతనికి సమాచారం ఇచ్చారు. బాలరాజు అక్కడికి చేరుకునేలోపే కారు పూర్తిగా దగ్ధమైందని తెలియజేశారు. ఈ ఘటనతో బాలరాజు కన్నీరు మున్నీరయ్యాడు.

Leave a Reply