శభాష్ అనిపించుకున్న కుంటాల పోలీసులు..

శభాష్ అనిపించుకున్న కుంటాల పోలీసులు..

కుంటాల, ఆంధ్రప్రభ : కుంటాల మండల కేంద్రం నుండి కల్లూర్ వెళ్లే ప్రధాన రహదారి పై మూల మలుపుల వద్ద ప్రమాదకరంగా ఉన్న ముళ్ల చెట్లను పోలీసులు తొలగించారు. ఎస్ ఐ అజయ్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది జీసీ బీ సహయంతో ముళ్ల పోదలను తొలగించి ట్రాక్టర్ తో రోడ్డుకిరువైపుల చదును చేయించారు. అందకుర్, కల్లూర్ సమీపంలో రోడ్డుకు అడ్డంగా మారిన చెట్లతో తరుచూ యాక్సిడెంట్ లు జరుగుతున్నాయి. ప్రమాదాల నియంత్రణకు కృషి చేసేందుకు మూలమలుపుల వద్ద పొదలను తొలగించి ఇలాంటి ఇబ్బంది తలెత్తకుండా తొలగించారు.

దీంతో దాదాపు 8 కిలోమీటర్ల మేర కుంటాల కల్లూరు ప్రధాన రహదారి పై ఇరువైపుల ఉన్నటువంటి చెట్లను పొదలను తొలగించడం పట్ల పోలీసుల పని తీరు శభాష్ అంటూ అభినందిస్తున్నారు. కుంటాల ఎస్సై అజయ్ తనదైన శైలిలో ప్రమాదాలను అరికట్టెందుకే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు, వానచోదకులు సైతం మూలమలుపుల వద్ద జాగ్రత్తగా నడపాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ జీవన్ రావు, పోలీస్ సిబ్బంది సాదిక్ రతన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply