శభాష్.. సర్పంచ్..

శభాష్.. సర్పంచ్..

ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : మండల పరిధిలో పెద్దవెంకటాపురం గ్రామపంచాయతీలో ఇటీవల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మోరాయించింది. తక్షణమే పెద్దవెంకటాపురం గ్రామపంచాయతీ సర్పంచి వజ్జ ఉమా స్పందించింది. స్థానిక విద్యుత్ అధికారుల సహకారంతో విద్యుత్ డిబీ రిపేర్ చేయించి వెంకటాపురం ప్రజలకు వెలుగులు అందించింది. దీంతో సర్పంచ్ వజ్జ ఉమా ప్రజలందరితోను శభాష్ అనిపించుకుంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ప్రజాసమస్యలే తమ ఎజెండా అని హామీ ఇచ్చిన నేపథ్యంలో పెద్దవెంకటాపురం గ్రామంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా, నావారుగా, నాకుటుంబ సభ్యుల సమస్యలుగా భావించి, వెంటనే ట్రాన్స్ఫర్ కు విద్యుత్ సరఫరా అయ్యేలా కృషి చేయడంతో పార్టీలకతీతంగా నాయకులు, ప్రజలు సర్పంచి వజ్జ ఉమను అభినందించడం శుభపరిణామం.

విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో పెద్దవెంకటాపురం పంచాయతీ ప్రజలకు కరెంటు సరఫరా లేకపోవడంతో నీటి సమస్య, ఫ్యాన్, కూలర్, గృహోపకరణలు లేక చిన్నపిల్లలు, వృద్ధులు, ప్రజలు మహిళలు ఎంతో అవస్థలు పడ్డారు. దీంతో వాళ్ల అవస్థలు చూసి చలించిపోయి, వెంకటాపురం సర్పంచ్ వజ్జ ఉమా తక్షణ విద్యుత్ మరమ్మతులు నేరుగా దగ్గరుండి చేయించారు.

ఈ సందర్భంగా సర్పంచి వజ్జా ఉమ మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీపీఐ పార్టీ కార్యదర్శి షేక్ సాబీర్ పాషా స్ఫూర్తితో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీపీఐ పార్టీ కార్యవర్గ సభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు స్థానిక ఆళ్లపల్లి మండల మాజీ వైస్ ఎంపీపీ రేసు ఎల్లయ్య ప్రోద్బలంతో పెద్దవెంకటాపురం గ్రామపంచాయతీ, ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని గుర్తు చేశారు. పెద్దవెంకటాపురం గ్రామపంచాయితీ ప్రజలకు ఏ సమస్య ఉన్నప్పటికీ నాదృష్టికి తీసుకురావాలి అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దవెంకటాపురం ఉప సర్పంచ్ రాజేష్, చిరంజీవి, బాబురావు, ప్రవీణ్ నీలమయ్య, సురేందర్, రామస్వామి, శేఖర్, లక్ష్మీనర్సు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply