Welfare schemes | మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతా
Welfare schemes | ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ సర్పంచ్ గా గెలిపిస్తే రాళ్లపల్లి పంచాయతీని మోడల్ గ్రామం పంచాయతీగా తీర్చిదిద్దుతానని, పంచాయతీ పరిధిలోని రాయిగూడెం, మైలారం, లక్ష్మీపురం, చింతొల్లగుంపు, కొమ్ముగూడెంలో ఆయా గ్రామాల్లోని ప్రజలు చూపిస్తున్న ఆధారబిమానాలు, బ్రహ్మరథం పట్టడం నీరజనాలు పలకడంతో నా గెలుపు నల్లేరుమీద నడికే అన్నచందంగా మారడం ఎంతో శుభపరిణామమన్నారు.
పంచాయతీ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ, డ్రైనేజీ వ్యవస్థ(drainage system), వీధిలైట్లు, బావులు, చెరువులు, కుంటలు, చేతిపంపు పలు పంచాయతీ పారిశుద్ధ్యం పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడమే నాప్రధమ కర్తవ్యమని కాంగ్రెస్ సర్పంచ్ బాల్ గుర్తుపై మీఅమూల్యమైన ఓట్లతో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అందరితో కలిసి ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
సమస్యలు పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, గ్రామ సర్పంచ్ గా ఆదరిస్తే గ్రామాన్ని సర్వతోముగాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరుకై కృషిచేస్తూ, సర్కార్ చేపట్టిన సంక్షేమ పథకాలు(Welfare schemes) వచ్చేలా చూస్తానని, గ్రామఅభివృద్ధికి నిస్వార్ధంగా సేవచేసేభాగ్యం కల్పించాలని, మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తానని ప్రతి ఒక్కరికి పారదర్శకంగా అందిస్తానని, గెలిపిస్తే గ్రామ రూపురేఖలు మారుస్తానని సుస్మిత పేర్కొన్నారు.

