Welfare development | పాన గుర్తుకు ఓటెయ్యండి….

Welfare development | పాన గుర్తుకు ఓటెయ్యండి….

Welfare development | మంథని, ఆంధ్ర‌ప్ర‌భ : పాన గుర్తుకు ఓటెయ్యండి ప్రజల్ని ప్రాణంలా చూసుకుంటానని సర్పంచ్ అభ్యర్థి రాచర్ల రమేష్ కోరారు. ఈ రోజు మంథని మండలం పుట్టపాక గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి రాచర్ల రమేష్ ప్రచారంలో రాకెట్ లా దూసుకెళ్తున్నారు. గడపగడపకు ప్రచారం చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో(local body elections) పాన గుర్తుకు ఓటేసి, అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు.

రాచర్ల రమేష్ ను గెలిపించడం మా బాధ్యతని ప్రజలే ఆయన తరుపున ప్రచారానికి దిగారు. వాడవాడలా రాచర్ల రమేష్ తరఫున ప్రజలు భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. పుట్టపాక గ్రామపంచాయతీ సర్పంచ్ గా గెలిచిన తర్వాత గ్రామంలో సంక్షేమ అభివృద్ధి(Welfare development) పనులు చేసి చూపిస్తానని ఆయన తెలుపుతున్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తానని ఆయన తెలిపారు. ప్రజల్ని సొంత కుటుంబంలో చూసుకుంటానని, అందరికీ అందుబాటులో ఉంటానని ఆయన వివరించారు. పానకు గుర్తుకు ప్రజలు తమ అమూల్యమైన ఓటీసి గెలిపిస్తే, వారికి నాణ్యమైన పరిపాలన అందిస్తానని ప్రతిజ్ఞ చేశారు.

Leave a Reply