Welfare | అందుబాటులో ఉంటా ఆశీర్వదించండి

Welfare | అందుబాటులో ఉంటా ఆశీర్వదించండి

Welfare | మంథని, ఆంధ్ర‌ప్ర‌భ : మంథని మండలం రచ్లపల్లి గ్రామ సర్పంచ్ జనగామ రత్నదీప నర్సింగరావు బరిలో ఉన్నారు. ఒక్కసారి అవకాశం కల్పించండి ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని ఆమె ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో ప్రజలంతా ఆమెకు బ్రహ్మరథం పడుతున్నారు.

గడపగడపకు ప్రచారం చేస్తూ జనంతో మమేకమై ప్రభంజనంలా దూసుకువెళ్తున్నారు. ఎన్నికల్లో కత్తెర గుర్తుకు ఓటెయ్యండి ఊరి అభివృద్ధికి కట్టుబడి ఉంటానని ఆమె తెలుపుతున్నారు. మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు అండతో రచ్చపల్లి గ్రామాన్ని మంథని మండలంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతానని ఆమె హామీ ఇస్తున్నారు.

గ్రామంలోని నిరుపేద ప్రజలకు సంక్షేమ పథకాలు(Welfare schemes) అందించడంలో ముందు ఉంటానని ఆమె తెలుపుతున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన పింఛన్లు మంజూరు చేయిస్తానని హామీ ఇస్తున్నారు. డ్రైనేజీ లు నిరంతరం శుభ్రం చేయించడం, నిరుపేద ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తానని అన్నారు.

మరోసారి ఎన్నికల్లో అవకాశం కల్పించాలని ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని ఆయన సతీమణి రత్నదీప తరపున జనగమ నర్సింగరావు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గడపగడపకు ప్రచారం చేస్తూ ప్రజలతో మమేకమవుతు నిరుపేద ప్రజల సమస్యలు తీర్చడానికి ఎన్నికల్లో(elections)కి వచ్చానని, మరోసారి ఆశీర్వదించాలని జనగమ దంపతులు ప్రజల్ని కోరుతున్నారు.

కత్తెర గుర్తుకు ఓటేయాలని అన్నివేళలా ప్రజలకు అండగా ఉంటానని ఆమె పేర్కొన్నారు. ప్రచారంలో ప్రజలతో మమేకమై ఆమె దూసుకు వెళ్తున్నారు. స్థానిక సమస్యల పైన అవగాహన ఉండడం కలిసొచ్చే అంశం. ఖచ్చితంగా తాను గ్రామ ప్రజలందరి సహకారంతో సర్పంచ్ గా గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply