Welfare | పాత్రికేయుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం…

Welfare | పాత్రికేయుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం…
ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ డైరీ ఆవిష్కరణ
సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి
Welfare | విజయవాడ, ఆంధ్రప్రభః పాత్రికేయుల సంక్షేమానికి అభివృద్ధికి కోసమే ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా కీలక స్థానం కలిగి ఉందన్నారు. పాత్రికేయులు సమాజానికి దిశానిర్దేశం చేసే శక్తిగా నిలుస్తారని కొనియాడారు. వారి సంక్షేమం, భద్రత, వృత్తి గౌరవం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ డైరీని మంత్రి బుధవారం సచివాలయంలోని తన ఛాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో మీడియా వంతెనలా పనిచేస్తుందని తెలిపారు. బాధ్యతాయుతమైన జర్నలిజం ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుందని చెప్పారు.
ఈ డైరీకి సంపూర్ణ ప్రాయోజకత్వం అందించిన అన్విత గ్రూప్ చైర్మన్ బొప్పన అచ్చుతరావు, డైరెక్టర్ బొప్పన నాగభూషణంలను మంత్రి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. పాత్రికేయుల కార్యక్రమానికి కార్పొరేట్ సంస్థలు సహకరించడం శుభపరిణామమని, ఇలాంటి సహకారం సమాజానికి మేలు చేస్తుందని పేర్కొన్నారు.
యూనియన్ అధ్యక్షుడు చావా రవి, కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు , ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ, కోశాధికారి ఏడుకొండలు , యూనియన్ నాయకులు జి. విజయకుమార్, గోపీనాథ్, బొప్పన రవికుమార్, మల్లికార్జునరావు, నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. ఈ డైరీ పాత్రికేయుల వృత్తి కార్యకలాపాలకు ఎంతో ఉపయోగకరమని మంచి సమాచారం పొందుపరిచారని సభ్యులు అభిప్రాయపడ్డారు.
