పెద్ద చెరువుపై తుమ్మచెట్లను తొలగించాలి…

కొమురవెల్లి, అక్టోబర్, 16 ఆంధ్రప్రభ : పెద్ద చెరువు కట్టపై తుమ్మ చెట్లను తొలగించాలని అధికారులకు వినతిపత్రం అందజేశారు. కొమరవెల్లి (Komuravelli) మండలంలో అయినా పూర్ గ్రామంలో ఉపాధిపై గ్రామసభ నిర్వ‌హించారు. ప్రజల సమక్షంలో సిపిఎం మండల కమిటీ నాయకుడు తేలు ఇస్తారీ మాట్లాడుతూ.. గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ప్రారంభం, పనుల ఎంపిక జాబితా తయారు చేసుకునే క్రమంలో మొదటిగా గ్రామాల్లో రిజర్వాయర్ చెరువుకట్ట నిర్మాణ పెండింగ్ లో ఉన్నటువంటి రిజర్వాయర్ పై కంపచెట్లు, వివిధ రకాల మురికి తుమ్మచెట్లు విపరీతంగా పెరిగాయ‌న్నారు. వాటి వలన కట్టలు తెగిపోయే ప్రమాదం ఉంద‌న్నారు. పర్యాటక ప్రాంతంగా కొమురవెల్లి దేవాలయం పక్కనే ఉన్నటువంటి రిజర్వాయర్ (Reservoir) ప్రజలు వస్తున్నటువంటి క్రమంలో కోతులు వారిని గాయపరిచిన పరిస్థితి ఉంద‌న్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి… చెరువు కట్టలపై దృష్టి పెట్టి చెరువులు, రిజర్వాయర్లు భవిష్యత్ తరాలకు అవసరం కాబట్టి వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంద‌న్నారు.

నెల రోజుల క్రితం తపాస్పల్లి రిజర్వాయర్ ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ పరిశీలించిన క్రమంలో కూడా ఈ విషయాన్ని స్వయంగా కలెక్టర్ స్పందించారన్నారు. కాబట్టి తక్షమే స్పందించి కనీసం ఆ చెట్లను తొలగించే విధంగా ప్రభుత్వ అధికారులు చూడాలని కోరుచున్నామ‌న్నారు. ఈ సమస్యలు పరిష్కరించక‌పోతే గ్రామ ప్రజలతో ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామన్నారు. విన‌తిప‌త్రం అందించిన వారిలో గ్రామ సిపిఎం మండల నాయకులు ఉల్లం ల్లంపల్లి సాయిలు, సిపిఎం గ్రామ కార్యదర్శి కానుగుల రాజు సున్నం యాదగిరి, ex వార్డ్ మెంబర్ కుక్కల అనిత, గ్రామ ప్రజలు సున్నం నరసయ్య, దేవదానం రాచకొండ భూమయ్య, ఆలేరు బీరయ్య, తేలు సత్యవ్వ, ఘనబోయిన రేఖ, జయవ్వ దీకొండ లాస్య, తదితర గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply