హైదరాబాద్ – ఈ ఏడాది షెడ్యూల్ కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ ఆశించిన వర్షాలు కురవలేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు విత్తనాలు వేసి వర్షం కోసం ఎదురుచూశారు. వర్షాలు కురవాలని పూజలు చేశారు. ఎట్టకేలకు వరుణ దేవుడు కరుణించాడు. తెలంగాణలో కుండపోత వానలు కురుస్తున్నాయి. నిన్న ఒక్కరోజే అత్యధిక వర్షపాతం నమైదైంది. ఆకాశానికి చిల్లుపడినట్లుగా కుండపోత వానలు కురిశాయి. రోడ్లు కాలువలను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ గుడ్ న్యూస్ అందించింది.
తెలంగాణలో ఇక విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు తిరిగి యాక్టివ్ అయినట్లు తెలిపింది. మరో రుతుపవన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని.. మరో ద్రోణి ఏర్పడితే భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాబోయే నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురువనున్నట్లు తెలిపింది.
ఈ వార్త కూడా చదవండి : Exclusive | రాహుల్ తోనే రక్ష : డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క
నేడు కూడా హైదరాబాద్ లో కుమ్ముడే
ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న రుతుపవన ద్రోణి ముందుకు కదులుతున్నది.. దీంతో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.కాగా నేడు కూడా హైదరాబాద్ సిటీలో నేడు భారీ వర్ష పడే అవకాశాలున్నాయని వెల్లడించింది. ముఖ్యంగా సాయంత్రం సమయాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో హైదరాబాదీలు అలెర్ట్ గా ఉండాలని ఐఎండీ సూచన.. జీహెచ్ఎంసీ.. డీఆర్ఎఫ్ తో పాటు సంబంధిత అధికారులను అలెర్ట్ చేసింది.

