గ్రామాభివృద్ధే ధ్యేయంగా పని చేస్తా…

  • చిట్యాల సర్పంచ్ అభ్యర్థి గుండ్రెడీ రంజిత్ రెడ్డి

తాడ్వాయి, ఆంధ్ర ప్రభ : చిట్యాల గ్రామ అభివృద్ధే తన ధ్యేయమని, సర్పంచ్ అభ్యర్థిగా ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని రంజిత్ రెడ్డి గ్రామ ప్రజలను కోరారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ… చిట్యాల గ్రామ ప్రజలతో మమేకమై, విశ్వాసంతో పనిచేస్తానని తెలిపారు. గ్రామ ప్రజలు, యువకులు తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. తన తాత రాజిరెడ్డి ఆశయాలను నెరవేర్చే దిశగా గ్రామ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని ఆయన తెలిపారు.

  1. ఐదు సంవత్సరాలలో ఒకసారి బతుకమ్మ పండుగ సందర్భంగా డ్వాక్రా మహిళలకు చీరలు పంపిణీ.
  2. పుట్టిన ప్రతి ఆడపిల్లకు 1 తులం వెండి బహుమతిగా అందజేయడం.
  3. వృద్ధులు, వితంతువు, వికలాంగ మహిళలకు పింఛన్లు వచ్చేలా కృషి.
  4. గ్రామంలోని పేద కుటుంబాల ఆడపిల్ల పెళ్లికి 5,000 రూపాయలు బహుమతి.
  5. యువకుల కోసం జిమ్ స్థాపన, లైబ్రరీ ఏర్పాటు.
  6. వృద్ధుల సంఘ భవనం నిర్మాణానికి కృషి.
  7. గ్రామంలోని నీటి కొరత, డ్రైనేజీ, విద్యుత్ సమస్యల పరిష్కారం.
  8. యువత కోసం ప్రతి సంవత్సరం క్రీడలు నిర్వహణ

గెలిచిన తర్వాత ఈ మేనిఫెస్టోను అమలు చేస్తానని, గ్రామ ప్రజలంతా కుల–మతాలకు అతీతంగా ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Leave a Reply