మౌలిక వసతులు కల్పనకు దశలవారీగా కృషి చేస్తా

కుంటాల, ఆంధ్రప్రభ ; ఫిబ్రవరి మౌలిక వసతుల కల్పనకు దశలవారీగా కృషి చేస్తానని ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. శనివారం కుంటాల మండలంలోని అంబకంటి అంబకంటి తండా గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంబకంటి నుండి నందన్ ఎక్స్ రోడ్ వరకు సీఆర్ ఆర్ నిధులతో రూ. 2కోట్ల 73 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. పనులు త్వరగా పూర్తిచేయాలని సంబంధిత కాంట్రాక్టర్ ఆదేశించారు అదేవిధంగా ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా ఎస్సీ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 20 లక్షలు మంజూరు కాగా.. నిధులతో పనులకు శంకుస్థాపన చేసి శ్రీకరం చుట్టారు అదేవిధంగా ఎంజిఎన్ఆర్ఇజిఎస్ ద్వార రూ. 33 లక్షలతో ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేసి ప్రారంభించారు.
అదేవిధంగా అంబకంటి తండాలోని మహిళా సంఘ భవన నిర్మాణానికి రూ. 20 లక్షల రూపాయలతో ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి తన లక్ష్యమని పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనకు తన వంతు సహాయ సహకారాలు కృషిచేసి ముధోల్ నియోజకవర్గం లోని అభివృద్ధికి నిరంతరం అండగా ఉంటానని పేర్కొన్నారు. అదేవిధంగా విద్య వైద్య పై ప్రత్యేక దృష్టి అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేస్తానని ఆయన తెలిపారు గత కొన్ని నెలల నుండి రహదారుల అద్వానంగా ఉండడంతో వాటికి నిధులు మంజూరు కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం కొట్లాడి నిధులు మంజూరు చేయించి పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. రహదారుల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలియజేశారు. అభివృద్ధికి నిరంతరం అండగా ఉండి ప్రజలకు నిరంతర అందుబాటులో ఉండే సేవ చేయడమే తన లక్ష్యమని గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలను దశలవారీగా పరిష్కారం చేసి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సైతం అద్భుతంగా అందించేందుకు అండగా ఉంటానని సమగ్రమైన అభివృద్ధి తన లక్ష్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అల్లాడి వనజ సర్పంచ్ లు రాణి ప్రదీప్ కుమార్ జాదవ్ జ్యోతిబాయ్ జక్కుల గజేందర్ స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు
