ధర్మపురి, ఆంధ్రప్రభ: తనను సర్పంచ్‌గా గెలిపిస్తే రాయపట్నం గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి రందేని మొగిలి అన్నారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ సహకారంతో ప్రత్యేక నిధులను తీసుకువచ్చి గ్రామ అభివృద్ధికి దోహదం చేస్తానని వెల్లడించారు.
ప్రజలు ఒక్కసారి అవకాశం కల్పించి రాయపట్నం సర్పంచ్‌గా గెలిపించాలని ఓటర్లను కోరారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ సేవకుడిలా సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు. రాయపట్నం ప్రజలు తన వెంట ఉన్నారని, తన గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

