మెకానిక్స్ ను ఆదుకుంటాం..

  • ఎంపీ కేశినేని శివ‌నాథ్..

విజ‌య‌వాడ, ఆంధ్రప్రభ : టూ వీల‌ర్స్ మెకానిక్స్ వాహ‌నాల త‌యారీలో వ‌స్తున్న సాంకేతిక‌ను అందిపుచ్చుకోవాల‌ని, అందుకు కావాల్సిన స‌హాయ స‌హాకార‌ల‌ను అందిస్తాన‌ని ఎంపీ కేశినేని శివ‌నాథ్ తెలిపారు. ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం కార్మికులు, శ్రామికుల‌కు అండ‌గా నిల‌బ‌డి వారి ఆర్థికాభివృద్ది కి కృషి చేస్తోంద‌న్నారు.

న్యూ నవ్యాంధ్ర టూ వీలర్స్ మెకానిక్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆద్వర్యంలో ఆదివారం విజయవాడ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న రైల్వే స్టేడియం మెకానిక్స్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ జ‌రిగింది. ఈ ఫైన‌ల్ మ్యాచ్ కు ముఖ్యఅతిథిగా ఎంపీ కేశినేని శివ‌నాథ్, దూదేకుల సంక్షేమ కార్పొరేష‌న్ చైర్మ‌న్ కె.నాగుల్ మీరా, మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుద్దా వెంక‌న్న‌ల‌తో క‌లిసి హాజ‌ర‌య్యారు. ఫైన‌ల్ మ్యాచ్ లో త‌ల‌ప‌డే న‌వ‌రంగ్ మెకానిక్స్ జ‌ట్టు వ‌ర్సెస్ ఒన్ టౌన్ మెకానిక్స్ జట్టు స‌భ్యుల‌కి ఎంపీ కేశినేని శివ‌నాథ్ శుభాకాంక్ష‌లు తెలిపారు. స్టేడియంలో మెకానిక్స్ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సంద‌ర్శించారు.అనంతరం స‌ర‌దాగా కాసేపు ఎంపీ కేశినేని శివ‌నాథ్ క్రికెట్ ఆడారు.

ఈ సంద‌ర్బంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ.. నిత్యం ప‌నులు చేస్తూ జీవించే వారికి క్రీడ‌లు ఆట విడుపు వుంటాయ‌న్నారు. ఒక టీమ్ గా ఆడే క్రీడ‌ల వల్ల ఐక్య‌మ‌త్యం పెరుగుతోంద‌న్నారు. గెలుపు ఓట‌ముల‌ను లెక్క‌లోకి తీసుకూడ‌ద‌న్నారు. క్రీడ‌లు ఆరోగ్యం మెరుగుద‌ల‌కు ఎంతో ఉప‌యోగంగా వుంటాయ‌న్నారు. మెకానిక్స్ అంద‌రూ ఒక ప్రొడ‌క్ట్ తయారు చేసేందుకు క్ల‌స్టర్ గా ఏర్ప‌డితే …అద‌న‌పు ఆదాయం రావ‌టానికి త‌న వంతు స‌హకారం అందిస్తాన‌ని తెలిపారు.

న‌వ‌రంగ్ మెకానిక్స్ జ‌ట్టు వ‌ర్సెస్ ఒన్ టౌన్ మెకానిక్స్ జట్టు కి జ‌రిగిన ఈ ఫైన‌ల్ మ్యాచ్ లో ఒన్ టౌన్ మెకానిక్స్ విజేత‌లుగా నిలిచారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగు దేశం పార్టీ ఉపాద్యక్షులు గొర్తి శ్రీనివాస చక్రవర్తి , న్యూ నవ్యాంధ్ర టూ వీలర్స్ మెకానిక్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్య‌క్షుడు కె.ప్ర‌సాద్, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ఎం.శ్రీనివాస‌రావు, టిడిపి నాయ‌కులు డాక్ట‌ర్ సంకే విశ్వ‌నాధంతో పాటు ఎన్డీయే కూట‌మి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అసోసియేష‌న్ స‌భ్యులు పాల్గొన్నారు.

Leave a Reply