అధైర్య‌ప‌డొద్దు

నేలకొరిగిన వరి పంటను పరిశీలించిన రాష్ట్ర మంత్రి రవీంద్ర


ఆంధ్రప్రభ – కృష్ణా ప్రతినిధి : మొంథా తుఫాను (Cyclone Montha) కారణంగా నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా అండగా ఉండి ఆదుకుంటుందని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర భ‌రోసా ఆచ్చారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం శివారులో నెలకొరిగిన వరి పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు.

కంకి పాలు పోసుకునే దశలో ఉండగా తుఫాను తీవ్ర నష్టాన్ని కలుగజేసిందని రైతులు ఆవేదన (Farmers distressed) వ్యక్తం చేశారు. ఎకరానికి 25 వేల వరకు ఖర్చు చేసి సాగు చేపట్టామని, ప్రస్తుతం ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ… తుఫాను నష్టపరిహార అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని, వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో తిరుగుతూ పంట నష్టం అంచనాలు రూపొందిస్తున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మంత్రి నారా లోకేష్ తుఫాను తీవ్రత కారణంగా ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారని తెలిపారు. ప్రతి రైతును ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

Leave a Reply