శ్రీకాంత్ కుటుంబానికి మంత్రి అడ్లూరి పరామర్శ
వెల్గటూర్ అక్టోబర్ 24:(ప్రభ న్యూస్) జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు బిడారి భూమయ్య కుమారుడు బిడారి శ్రీకాంత్ ఇటీవల గొల్లపల్లి మండలం గోవిందపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం శ్రీకాంత్ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన శ్రీకాంత్ ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండాటి గోపిక జితేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి, మహిళ అధ్యక్షురాలు అనుమాల మంజుల, మాజీ సర్పంచ్ లు బొడుక మంజుల గంగయ్య, జగదీశ్వర్ రెడ్డి, రామగిరి నందయ్య, బిళ్లకూరి తిరుపతి, రామిల్ల లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మంత్రి వెంట ఉన్నారు.

