ఉట్నూర్, మార్చి 15 (ఆంధ్రప్రభ) : నూతనంగా ఎన్నికైన ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం రైతుల సంక్షేమానికి కృషి చేయాలని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నూతనంగా ఎన్నికైన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈసందర్భంగా శాలువాతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గానికి శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, ఆ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానాన్ని కల్పిస్తుందన్నారు. నూతనంగా ఎన్నికైన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం రైతుల అభివృద్ధికి పాటు పడాలన్నారు.
రైతు లేనిది దేశం లేదని, రైతులే ఈ దేశానికి వెన్నుముక అన్నారు. ఈ కార్యక్రమంలో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అబ్దుల్ ఖయ్యూం, పార్టీ సభ్యులు దూత రాజేశ్వర్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లింగంపల్లి చంద్రయ్య, జైనూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జైవంత్ రావు, కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ యూత్ ఇంచార్జ్ ఆత్రం రాహుల్, కాంగ్రెస్ నాయకులు బిరుదుల లాజర్, కొత్తపెళ్లి మహేందర్, మేస్రం ఓమేష్, తదితరులు పాల్గొన్నారు.