ప్రభుత్వాన్ని బదనాం చేయవద్దు..

ప్రభుత్వాన్ని బదనాం చేయవద్దు..
కుమ్మెర ఘటన సీఎం దృష్టికి తీసుకువెళ్తాం
ఈ ఘటనపై విచారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతాం
ప్రభుత్వంపై బురద చల్లడం సరికాదు
నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మల్లు రవి
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్ర ప్రభః నాగర్కర్నూల్ మండలం కుమ్మెర గ్రామంలో జరిగిన రెండు నెలల పసిబిడ్డ మృతి ఘటన దురదృష్టకరమని ఘటనకు బాధ్యులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, పసిపాప మరణాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడం తగదని , ప్రభుత్వంపై బురద చల్లడం సరికాదని వాస్తవాలు తెలుసుకోవాలని ఏ రకమైన చర్చకైనా సిద్ధమని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి స్పష్టం చేశారు శుక్రవారం సాయంత్రం నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర ఘటనపై నిజ నిర్ధారణ కోసం ప్రత్యేక బృందం పర్యటిచ్చారు.
నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి ఆధ్వర్యంలో బృందం గ్రామ సందర్శoచ్చారు కుమ్మెర గ్రామ పెద్దలు, యువకులు, మహిళలతో సమావేశం అయ్యారు* సంఘటనపై పూర్తి వివరాలు సేకరించిన నిజ నిర్ధారణ బృందమ్ చెసింది. ఈ బృoదం లో జాతీయ ఆదివాసి కాంగ్రెస్ చైర్మన్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ టీపీసీసీ ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ , నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ,మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా పోత్వల్ ,డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్ మల్లు రవి మాట్లాడారు సంఘటన వివరాలను వెల్లడించారు ఘర్షణ విషయంలో శ్రీనివాస్ రెడ్డి కేసు పెట్టినప్పుడు గణేష్ కూడా కొట్టినట్లు ఫిర్యాదు చేశారు కానీ పసికందు విషయం ఆ పిటిషన్ల ప్రస్తావించలేదని చెప్పారు ఇదే విషయం పసికందు విషయాన్ని 21వ తేదీన ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారని చెప్పారు. ఈ ఫిర్యాదు పై 307 కేసు నమోదు అయ్యిందని వివరించారు.మౌనిక కులం ఎస్సీ కాదని దీనిపై రెవెన్యూ అధికారులు ఇచ్చిన వివరణలు బిసిఏ ఉన్నదని చెప్పారు. పసి కందు ఉన్నట్లుకేసులో రాయలేదని చెప్పారు.
ఇదే విషయంపై కుమ్మెర గ్రామంలో అందరి సమక్షంలో మాట్లాడడం జరిగిందని అందులో కుల వివక్ష ఆ గ్రామములో లేదని అందరూ ముక్తకంఠంతో చెప్పారని తెలిపారు ఈ ఘటనపై ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు చేసిన ఆందోళనలో తప్పు పట్టడం లేదని వాస్తవాలు తెలుసుకొని పోరాటం చేయాలని ప్రభుత్వం పై బురద చల్లడం బదనాం చేయవద్దని అన్నారు ఈ కేసు విషయంపై బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఆ కుటుంబానికి కలెక్టర్ ప్రభుత్వం లక్ష రూపాయల నగదు ఇల్లు ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిందని చెప్పారు.

ఈ విషయంపై జిల్లా ఎస్పీ కలెక్టర్ లతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని సంబంధిత అధికారులకు సూచనలిస్తూ ముందుకు పోతున్నామని తెలిపారు తాను దళితుల పక్షాన బాధితుల పక్షాన మాట్లాడుతున్నానని ఆమెకు న్యాయం జరిగే వరకూ అన్యాయం జరిగితే తప్పనిసరిగా పార్టీలకతీతంగా పోరాటం చేద్దామని కోరారు. గత ప్రభుత్వంలో పోలీసు రాజ్యం నడిచిందని ఇప్పుడు అటువంటిది లేదని ప్రజాసంఘాలు పార్టీలు ఆందోళన చేసిన జోక్యం చేసుకోలేదని తెలిపారు. తెలంగాణకు చెడ్డ పేరు తేవద్దని రాజకీయాలు గుడి పెట్టడం ముడి పెట్టడం సరికాదని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఎమ్మెల్యేలు వంశీకృష్ణ రాజేష్ రెడ్డి వీరశంకర్,డిసిసిబి మాజీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మార్కెట్ చైర్మన్ రమణ రావు మున్సిపల్ చైర్మన్ సునీంద్ర పాల్గొన్నారు.
