CBN | పేదల సంక్షేమానికి క‌ట్టుబ‌డి ఉన్నాం

CBN | పేదల సంక్షేమానికి క‌ట్టుబ‌డి ఉన్నాం

రూ. 51 వేల కోట్లతో పింఛన్ల పంపిణీ
దేశంలో ఇది అత్యధికం
వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

CBN | సంతబొమ్మాళి(శ్రీకాకుళం), ఆంధ్ర‌ప్ర‌భ : కూటమి ప్రభుత్వం గత 18 నెలల కాలంలో పేద ప్రజల సంక్షేమం కోసం పింఛన్ల పంపిణీకి రూ. 51 వేల కోట్లు ఖర్చు చేసిందని, దేశంలో ఇది అత్యధిక మొత్తమ‌ని, ఈ ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఉద్ఘాటించారు. సంతబొమ్మాళి మండలం కొల్లిపాడు గ్రామంలో ఈ రోజు నిర్వహించిన ఎన్టీఆర్ (NTR) భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. కొల్లిపాడు గ్రామ లబ్ధిదారులకు ఆయన స్వయంగా ఇంటింటికీ వెళ్లి పింఛన్లను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివంగత నేత నందమూరి తారకరామారావు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలోనే పింఛన్ల వ్యవస్థ బలోపేతమైందని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం పింఛన్ (Pension) మొత్తాన్ని రూ. 2875 పెంచగా, గత ప్రభుత్వాలు కేవలం రూ. 1125 మాత్రమే పెంచాయని విమర్శించారు. జనవరి 1 నుంచి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ నూతన పింఛన్లు మంజూరు చేస్తామని, ప్రతి నెలా ఒకటో తేదీ పేద ప్రజలకు పండుగలా మారిందన్నారు.

పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ముందు మంత్రి సంతబొమ్మాళి మండలంలో మంత్రి సుడిగాలి పర్యటన చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయన సుమారు రూ. 5 కోట్ల విలువైన పలు అభివృద్ధి, రహదారి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గొదలాం వద్ద వీరభద్రపురం రహదారిని ప్రారంభించారు. అనంతరం అక్కడే ఆర్ అండ్ బీ (R and B) రహదారి, కొల్లిపాడు వద్ద ఆర్ అండ్ బి రహదారి, మలగాం పంచాయతీ, చెరువు గట్టుపేట గ్రామం వద్ద కొల్లిపాడుకు వెళ్లే రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మారుమూల గ్రామాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని మంత్రి తెలిపారు. సంతబొమ్మాలి మండలంలో సోమవారం ఒక్కరోజే రూ.ఐదు కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయన్నారు.

అనంత‌రం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను (Journey) మెరుగుపరిచేందుకు రూ. 4 వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ముఖ్యంగా రైతులకు భరోసా కల్పిస్తూ, వారు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి, కేవలం 4 గంటల్లోనే వారి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామ‌న్నారు. ఈ విధంగా రైతు సంక్షేమం, విద్య, సామాజిక భద్రత వంటి అంశాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత‌నిస్తోందని ఆయన తెలిపారు.

Leave a Reply