way2future |మీ డీఎన్ఏ.. ఏ వ్యాధికి మూలం

way2future |మీ డీఎన్ఏ.. ఏ వ్యాధికి మూలం
కృత్రిమ మేథ (ఏఐ) విప్లవం అన్నికోణాల్లోకి చొచ్చు కెళ్తోంది.. ఇప్పుడు జన్యుశాస్త్రంలోకి జొరబడింది. కొత్త కొత్త పరిశోధనలకు కీలకంగా మారింది. నూతన ఆవిష్క రణలకు మార్గాలను సుగమం చేస్తోంది. నూతన ఆర్టిఫిషి యల్ టూల్స్ డీఎన్ఏలోని జన్యుమార్పులను చదివేస్తు న్నాయి.
ఈ మార్పులు హానికరమా కాదా అని మాత్రమే కాకుండా, అవి ఎలాంటి వ్యాధులకు దారితీయవచ్చో కూడా ముందుగానే అంచనా వేస్తోంది. భవిష్యత్లో చుట్టుముట్టే వ్యాధులు.. నివారణ, చికిత్స పద్ధతుల గురించి ముందుగానే చెబుతుంది. ప్రస్తుతం అందుబాటు లో ఉన్న జన్యు విశ్లేషణ టూల్స్ ద్వారా జన్యుమార్పులు హానికరమా? కాదా? అని మాత్రమే తెలుసుకోవచ్చు.
way2future |మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీ
కానీ, కొత్తగా వచ్చిన వీడిపీ తరహా అడ్వాన్స్డ్ మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీ ఉపయోగించి, నాడీ వ్యవస్థ రుగ్మతలు, క్యాన్సర్ వంటి నిర్దిష్ట వ్యాధి రకాలను కూడా విశ్లేషించొచ్చు. ఈ టెక్నాలజీ అరుదైన, సంక్లిష్ట వ్యాధులకు సంబంధించిన డయాగ్నోసిస్ ను వేగవంతం చేస్తుంది. కొత్త చికిత్సల అభివృద్ధికి సహాయ పడుతుంది.
లక్షలాది ఎలక్ట్రానికెల్త్ రికార్డులు, ల్యాబ్ టెస్టులను ఈ ఏఐ టూల్ విశ్లేషిస్తుంది. అరుదైన మ్యుటేషన్లు వ్యాధిని కగిలించే అవకాశాన్ని అంచనా వేస్తుంది. రిస్క్ గురించి సమగ్రమైన డేటా ఇస్తుంది. తద్వారా లించ్ సిండ్రోమ్ వంటి క్యాన్సర్ రిస్క్ వేరియంట్లకు స్క్రీనింగ్ నిర్ణయాలు తేలికవుతుంది. అనిశ్చిత వేరియంట్లను సైతం గుర్తిస్తుంది. ఈ టెక్నాలజీల ద్వారా ఏ మేరకు ఏయే ఔషధాలు అవసరమో కనుగొ నడం సులువవుతుంది.
way2future |వ్యక్తిగత ఔషధం.. చికిత్స..
అలాగే ఈ విధానంలో వ్యక్తిగత మెడికల్ రికార్డులను మరింత మెరుగుపర్చవచ్చు. ఒక చికిత్సకు ఒకే ఔషధం అనే సాంప్రదాయ విధానాన్ని మార్చే స్తుంది. ప్రతి ఒక్క వ్యక్తి జన్యువులు. పరిస్థితులు, జీవనశైలిని ఆధారంగా చేసుకుని వ్యాధి నిర్ధారణ, నివారణ, చికిత్సకు కచ్చితమైన పద్దతులను సూచిస్తుంది. అలాగే ఫఆర్మకోజెనో మిక్స్ ద్వారా ఒక వ్యక్తి జన్యువుల ప్రతి స్పందన ఆధారంగా సదరు వ్యక్తికి ఔషధం ఎలా పనిచేస్తుందో సరిగ్గా అంచనా వేయవచ్చు.
తద్వారా ఎంత మోతాదు అవసరమో నిర్ణయించడంలో వైద్యులకు సహాయపడుతుంది. సరైన వ్యక్తికి సరైన ఔషధం, సరైన సమయంలో ఇవ్వడం వల్ల వ్యాధిని నయం చేయవచ్చు.. లేదా నియంత్రణలోకి తేవచ్చు. అనవసర ఔషధాలను దూరం పెట్టడం వల్ల దుష్ప్రభా వాలు తగ్గించొచ్చు.
