ప|| సంకట హనుమంతునిగా పేరుతో వెలసిన
శ్రీ ఆంజనేయునికీ సువర్చలకూ నీరాజనం ||
అను|| సంకటములును తొలగించి భవభయములను
హరించీ శక్తినీ భక్తినీ చేకూర్చే
ఆంజనేయునకు సువర్చలకు నీరాజనం ||
చ|| సకల రోగముల నివృత్తి చేసి జ్ఞానము
ధర్మము ప్రసాదించి సంకట హనుమగా
రామబంటుగా సూర్యుని శిష్యునిగా వాయు
తనయునిగా జ్ఞానములో శాస్త్రములో వివేక
వంతునిగా పేరు గడించిన సంకట హనుమకు
సువర్చలా హృదయునికీ నీరాజనం ||