గ్రామ అభివృద్ధి మా ప్రధాన లక్ష్యం

గ్రామ అభివృద్ధి మా ప్రధాన లక్ష్యం

వేసవిలో నీటి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు

మంథని, ఆంధ్ర‌ప్ర‌భ : గ్రామాన్ని అభివృద్ధి చేయడమే మా ప్రధాన లక్ష్యం అని ఎక్లాస్ పూర్ గ్రామ సర్పంచ్ బొడ్డు రజిత శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండలంలోని ఎక్లాస్పూర్ గ్రామపంచాయతీలోని రెండవ వార్డులో నీటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుని నూతన సింగల్ ఫేస్ మోటార్ వేసి నీటి సమస్యలు తీర్చారు. గ్రామంలో ఏ వార్డులో ఎవ్వరికి నీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికలు చేపట్టి నీటి సమస్యలపై సర్పంచ్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ రజిత శ్రీనివాస్ మాట్లాడుతూ… ప్రజల సేవ చేసేందుకే తాము ఉన్నామని ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా గ్రామంలో ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుని ముందుకు సాగుతామని అన్నారు అనంతరం రెండవ వార్డ్ సభ్యురాలు తగరం రాణి మాట్లాడుతూ… తమ వార్డులో నీటి ఎద్దడి ఉన్నదని చెప్పగానే వెంటనే సింగిల్ ఫేస్ మోటర్ వేసిన సర్పంచ్ రజిత శ్రీనివాస్ లకు సహకరించిన ఉప సర్పంచ్ పర్వతాలు యాదవ్, వార్డు సభ్యులు బండి లావణ్య శంకర్, గువ్వల రాజు, రాదండి దేవమ్మ రాజనర్సి, పంచిక దేవేందర్, గుడిమల్ల తిరుపతి, జంజర్ల శశికళ ప్రభు, బర్ల రజిత సురేందర్ ,గంట ప్రశాంత్ కార్యదర్శి ప్రేమలత లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి మంథని లక్ష్మణ్ గ్రామస్తులు బూడిద లింగయ్య, బూడిద మల్లయ్య, ఖమ్మంపల్లి గట్టయ్య, చెన్నూరి కనుకయ్య, బానయ్య, గట్టయ్య , మంథని కనకయ్య ,రమేష్ ,నిఖిల్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Leave a Reply