Water Plant | గ్రామాభివృద్ధి కోసం ముందుండి నిలబడతా..

Water Plant | గ్రామాభివృద్ధి కోసం ముందుండి నిలబడతా..

  • పుట్టిన ప్రతి పేదింటి ఆడబిడ్డకు రూ.5016 కానుక
  • బొమ్మారెడ్డిపల్లి సర్పంచ్ అభ్యర్థి దార రాజ్కుమార్

Water Plant | పెద్దపల్లి జిల్లా ధర్మారం, ఆంధ్రప్రభ : గ్రామాభివృద్ధి కోసం ముందుంటానని బొమ్మారెడ్డిపల్లి గ్రామ ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని సర్పంచ్ అభ్యర్థి దార రాజ్కుమార్ హామీ ఇస్తున్నారు. బొమ్మారెడ్డిపల్లి గ్రామ ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ముత్యాలు బాలరాం రెడ్డి ప్రోత్సాహంతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలబడుతున్నానని రాజ్కుమార్ తెలిపారు.

ఈ రోజు ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గ్రామంలో గడప గడప ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అభ్యర్థి దార రాజు మాట్లాడుతూ.. గ్రామంలో పేద ప్రజలకు కష్టాలలో అండగా నిలబడ్డానని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా నా సమస్యగా నిలబడి ప్రతి పనిలో తోడుగా ఉంటానని, బొమ్మారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధి(Development) ధ్యేయంగా పనిచేస్తానని చెప్పారు.

బొమ్మారెడ్డిపల్లి గ్రామంలో శాశ్వత ప్రాతి పాదికన వడ్లకొనుగోలు కేంద్రాన్ని(center) ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేస్తా నని, గ్రామ పంచాయతీ ఆవరణలో మినరల్ వాటర్ ప్లాంట్(Water Plant), గ్రంథాలయం, మానసిక, శారీరక వికాసానికి ప్రభుత్వ స్థలంలో జిమ్, గ్రామం నుండి మెయిన్ రోడ్ వరకు సోలార్ వీధి దీపాలు, ఐకేపీ మహిళా భవనం, తండా నుండి పాత ఎస్సీ కాలనీ వరకు డ్రైనేజి నిర్మాణం, మెయిన్ రోడ్ నుండి గ్రామానికి వెళ్లే దారిలో కమాన్ నిర్మాణం చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.

ముఖ్యంగా ప్రతి పేదింటిలో జన్మించిన వెంటనే ఆడపిల్ల కు 5016 రూపాయలు 20సంవత్సరాలు వరకు బ్యాంకు డిపాజిట్ చేసి తల్లిదండ్రులకు బాండ్ పేపర్స్(Bond Papers) అందిస్తానని హామీ ఇచ్చారు. బొమ్మారెడ్డిపల్లి గ్రామస్తులు ఆశీర్వదించి తన గుర్తు అయిన లేడీ పర్సు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో సర్పంచ్ గెలిపించాలని గ్రామస్తులను కోరారు.

Leave a Reply