Water Plant | రామచంద్రు తండాను అభివృద్ధి చేస్తా

Water Plant | రామచంద్రు తండాను అభివృద్ధి చేస్తా

  • సర్పంచ్ అభ్యర్థి పానుగోత్ కవిత ప్రదీప్

Water Plant | పెద్దవంగర, ఆంధ్రప్రభ : 14వ తేదీన జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసి ఆశీర్వదించాలని సర్పంచ్ అభ్యర్థి పానుగోత్ కవిత ప్రదీప్ ఓట‌ర్ల‌కు విజ్ఞప్తి చేశారు. గురువారం రామచంద్రు తండాలో స్థానిక(Local) బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా పానుగోత్ కవిత ప్రదీప్ మాట్లాడుతూ… ప్రతీ నెల గ్రామసభ(Gram Sabha) నిర్వహిస్తానని, గ్రామాభివృద్ధి పనుల వివరాలను, ఖర్చులను బహిర్గతంగా తెలియజేస్తానని, తండాలో శాఖా గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేస్తానని, తాగునీటి సౌకర్యం కోసం సొంత నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్(Water Plant) ఏర్పాటు చేస్తానని, అధికారులతో మాట్లాడి పల్లె దవాఖానా ఏర్పాటుకు కృషి చేస్తానని గడపగడపకూ తిరుగుతూ హామీ ఇచ్చారు.

Leave a Reply