Warning | గడువు లోపు వెళ్లకపోతే మూడేళ్లు జైలు.. భారీగా జరిమానా

హైదరాబాద్:: భారత్ లో ఉంటున్న పాకిస్థాన్ పౌరులకు కేంద్ర ప్రభుత్వం మరో బిగ్ షాక్ ఇచ్చింది. డెడ్ లైన్ లోగా పాకిస్తాన్ పౌరులు దేశం వీడకపోతే వారిని జైలుకి పంపిస్తామని కేంద్రం వార్నిం గ్ ఇచ్చింది. అంతేకాదు 3 లక్షల రూపాయలు జరిమానా విధిస్తామంది. ఏప్రిల్ 4న అమల్లోకి వచ్చిన ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారిన్ యాక్ట్ 2025 ప్రకారం.. గడువు ముగిశాక భారత్ లో ఉన్న పాక్ పౌరులకు మూడేళ్ల జైలు లేదా 3 లక్షలు జరినిమా.. లేదా రెండూ విధించే అవకాశం ఉంది.

ఇక మెడికల్ వీసాల మీద ఉన్న పాకిస్తాన్ పౌరులు ఏప్రిల్ 29వ తేదీలోగా భారత దేశం విడిచి వెళ్లాలి.పాకిస్తాన్ జాతీయులు భారతదేశం విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం డెడ్ లైన్ కూడా విధించింది.

ఏప్రిల్ 22న జమ్మకశ్మీర్‌ లోని పహల్గాంలో పాకిస్తాన్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది మరణించారు. వారిలో ఎక్కువగా పర్యాటకులు ఉన్నారు.ఈ ఉగ్రదాడి యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆ వెంటనే భారత ప్రభుత్వం ప్రతి చర్యలకు దిగింది. పాకిస్తాన్ పై కఠినమైన ఆంక్షలు విధించింది. వెంటనే భారత్ లో ఉంటున్న పాక్ పౌరులు దేశం విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశించింది.

అందుకు డెడ్ లైన్ కూడా విధించింది.ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ జాతీయులకు ‘భారతదేశం విడిచి వెళ్లండి’ అంటూ నోటీసు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. సార్క్ వీసాలు కలిగి ఉన్న వారు ఏప్రిల్ 26 లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించిం ది. మెడికల్ వీసాలు ఉన్న పాకిస్తాన్ జాతీయులు ఏప్రిల్ 29 లోపు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది.

ఆదివారం నాటికి దేశం విడిచి వెళ్లాల్సిన 12 కేటగిరీల వీసాలలో వీసా ఆన్ అరైవల్, బిజినెస్, ఫిల్మ్, జర్నలిస్ట్, ట్రాన్సిట్, కాన్ఫరెన్స్, పర్వతారోహణ, విద్యార్థి, సందర్శకులు, గ్రూప్ టూరిస్ట్, యాత్రికులు, గ్రూప్ యాత్రికుల వీసాలు ఉన్నాయి.

ఇప్పటికే రాష్ట్రాల్లో ఉంటున్న పాకిస్తాన్ పౌరులను గుర్తించి వారిని వారి దేశానికి పంపేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వా లకు ఆదేశాలు ఇచ్చారు హోంమంత్రి అమిత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *