రామగిరి : : వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలీసుల బట్టలు ఊడదీస్తానంటూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చంచలనంగా మారాయి. జగన్ శ్రీ సత్య సాయి జిల్లా రాప్తాడు పర్యటనలో చేసిన వ్యాఖ్యలకు రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
పోలీసుల బట్టలు ఊడదీసి కొడతా అంటున్నావు జగన్. అవి ఏమైనా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకుంటున్నారా? మేం కష్టపడి చదివి సాధించు కున్న యూనిఫామ్ అది. ఎన్నో వేల మంది పోటీ పడితే పరీక్షల్లో నెగ్గి, పరుగు పందాలు ఈవెంట్లలో క్వాలి ఫై అయ్యి యూనిఫామ్ సాగించుకున్నాం. మీరు వచ్చి ఊడదీస్తా మంటే తీయడానికి ఇది అరటి తొక్క కాదు. పోలీసులు ప్రభుత్వానికి గానీ, నాయకులకుగానీ తొత్తులు కాదు. మేం నిజాయితీగానే పని చేస్తాం, నిజాయితీగానే చస్తాం. కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అంటూ మాజీ సీఎం జగన్ కు రామగిరి ఎస్సై కౌంటర్ ఇచ్చారు.
మార్చిలో రామగిరి ఎంపీపీ ఎలక్షన్స్ సందర్భంగా పోలీసులు చట్టబద్ధంగానే నడుచుకున్నారు. సత్యసాయి జిల్లా ఎస్పీ ఆదేశాలతో వందల మంది పోలీసులతో బందోబస్తు కల్పించాం. కానీ ఎంపీటీసీలను రామేశ్వరం తీసుకెళ్లి ఎలక్షన్ వాయిదా పడేలా చేశారని ఎస్ఐ సుధాకర్ యాదవ్ అన్నారు.