Lokesh | విశాఖపట్నం, ఆంధ్రప్రభ : విశాఖ విమానాశ్రయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు కూటమి ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. లోకేష్ ఎయిర్‌పోర్ట్ నుంచి నోవాటెల్ హోటల్ కు చేరుకున్నారు. నోవాటెల్‌లో సీఎం చంద్రబాబునాయుడుతో కలిసి రెన్యూ పవర్ సంస్థతో ఎంవోయూ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం విశాఖ ఐటీ హిల్స్‌లో పలు ఐటీ కంపెనీలతో పాటు రహేజా ఐటీ స్పేస్, రెసిడెన్షియల్ ప్రాజెక్ట్, వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు.


