warm welcome | నందిగామలో పురంధేశ్వరి ప‌ర్య‌ట‌న

warm welcome | నందిగామలో పురంధేశ్వరి ప‌ర్య‌ట‌న

  • ఘ‌న స్వాగతం పలికిన ప్రభుత్వ విప్ సౌమ్య
  • కూటమి, భాజపా నేతల ఆత్మీయ సత్కారం

warm welcome | నందిగామ, ఆంధ్రప్రభ : రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు పురందేశ్వరి నందిగామ పర్యటనకు విచ్చేశారు. పట్టణంలోని కాకాని నగర్‌లో ఘన స్వాగతం లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో కూటమి నేతలు, భారతీయ జనతా పార్టీ నాయకులు కలిసి ఆమెను ఆత్మీయంగా ఆహ్వానించారు.

warm welcome

కాకాని నగర్‌లోని ప్రభుత్వ విప్ సౌమ్య కార్యాలయం వద్ద పురంధేశ్వరికి పుష్పగుచ్ఛాలు అందించి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వేంకటేశ్వర స్వామి ప్రతిమను బహూకరించారు. అదేవిధంగా మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌కు బుద్ధుని ప్రతిమను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కూటమి, భాజపా నేతలు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply