wards | ఆశీర్వదిస్తే.. సమస్యలు పరిష్కరిస్తా…
ఇంటింటి ప్రచారం చేపడుతున్న బీజేపీ పార్టీ శ్రేణులు
wards | కుంటాల, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా మండల కేంద్రమైన కుంటాలలోని గ్రామపంచాయతీ ప్రజలు ఈసారి ఎన్నికల్లో ఆశీర్వదించి ఆదరిస్తే పంచాయతీ అభివృద్ధితో పాటు ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని గ్రామ పంచాయతీ బీజేపీ పార్టీ బలపరిచిన ఆప్కా గజ్జారం యాదవ్ హామీ ఇచ్చారు.
ఆయన కుంటాల మండల కేంద్రంలోని అన్ని వార్డుల్లో(wards) విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రజలకు పలు హామీలు ఇస్తున్నారు. ప్రజల సంక్షేమం, సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పన కోసం పాటుపడతానని ఆమె ప్రచారంలో ప్రజలకు హామీలు ఇస్తూ ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నారు.
తనకు అవకాశం కుంటాల మండల కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి(development) చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ప్రచారంలో బీజేపీ పార్టీ శ్రేణులు(BJP party ranks) వెంకట్రావు, చిన్నన్నరావు, భోగ గోవర్ధన్, కొండన్నగారి రమణారావుతో పాటు పలువురు బీజేపీ పార్టీ నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

