Wardhannapeta | సూపర్ పోలీస్..
Wardhannapeta, ఆంధ్రప్రభ: జాగృతి పోలీస్ కళా బృందం, వరంగల్ (Warangal) నగర పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు గురువారం రాత్రి 9:30 గంటలకు వర్దన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇల్లంద గ్రామంలో, మూఢనమ్మకాల పై అపోహలు తొలగించాలని అలాగే ఇలాంటి వారు ఎవరైనా తెలిస్తే.. పోలీస్ వారికి సమాచారం అందించాలని, మూఢనమ్మకాలు నమ్మవద్దని, యువకులు గంజాయి డ్రగ్స్, గుట్క మత్తు పదార్థాల బారిన పడవద్దని, గంజాయి అమ్మిన సేవించినా 8712584473 మొబైల్ నెంబరుకు సమాచారం అందిచాలని తెలియజేశారు.
చదువు, రోడ్డు ప్రమాదాలు, బాల్య వివాహాలు, బాలకార్మికులు, డయల్ 100, సీసీటీవీ (CCTV) కెమెరాలు, వృద్ధాప్యంలో తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి.. తదితర సామాజిక అంశాల పై పాటల ద్వారా వివరిస్తూ, ఆన్ లైన్ మోసాల పై సైబర్ క్రైమ్స్ నాటికల ద్వారా 1930 సైబర్ హెల్ప్ లైన్ నంబర్ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి వర్ధన్నపేట ఎస్సై సాయిబాబు, కానిస్టేబుల్ ఆఫీసర్స్ కళాబృందం ఇంచార్జి నాగమణి, సభ్యులు, విలియమ్, వెంకటేశ్వర్లు, రత్నయ్య, హోంగార్డ్స్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

