Ward members | కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి

Ward members | కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి
జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే అధ్యక్షుడు వంశీకృష్ణ
Ward members | నాగర్కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : జిల్లాలో మూడు విడతలుగా జరిగే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యులను గెలిపించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కోరారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడుతూ… గ్రామాలు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. మహాత్మాగాంధీ ఆలోచనా విధానాల మేరకు రాజీవ్ గాంధీ గ్రామాల పటిష్టతకు చర్యలు చేపట్టారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణను ప్రపంచస్థాయిలో ఆర్థికంగా ఎదిగేలా గ్లోబల్ సమ్మిట్ విజయవంతంగా నిర్వహించారన్నారు. గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని కోరారు.
గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో ఓటర్ల నుంచి కాంగ్రెస్ కు మంచి ఆదరణ వస్తుందన్నారు. మద్దిమడుగు ఆలయం నుంచి క్రిష్ణానది వద్ద బ్రిడ్జి కోసం కేంద్ర మంత్రి గడ్కరీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కోరగా, సానుకూల స్పందన వచ్చిందన్నారు. అచ్చంపేటలో కొద్దిగా బీఆర్ఎస్ బలంగా ఉందని, బీజేపీ ఉనికి నామమాత్రమన్నారు.

ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ… నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో మంజూరైన కొత్త బస్టాండు, జిల్లా ఆస్పత్రి, ఇంటిగ్రేటెడ్ స్కూల్, జూనియర్ కళాశాల నిర్మాణం త్వరలో పనులు, శంఖుస్థాపనలు చేస్తామన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో చేయని అభివృద్ధి రెండేళ్లలో చేపట్టామన్నారు. ఓ ప్రణాళికతో అభివృద్ధి ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందన్నది గుర్తించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల తరువాత గ్రామాల్లో అభివృద్ధి మరింత ముందుకు తీసుకెళ్తుందన్నారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్లు రాజు, సుధీంద్ర, నిజాం, శ్రీనివాసులు, రేణు బాబు పాల్గొన్నారు.
