నిరంతర శ్రద్ధతో వార్డు అభివృద్ధి

ఆలేరు,ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతామని నూతన కౌన్సిలర్ జూకంటి సంపత్ శుక్రవారం చెప్పారు. వార్డు పరిధిలోని పలు సమస్యలను సమీక్షించి అందరి సమన్వయంతో వాటి పరిష్కారానికి పూనుకుంటామని తెలిపారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తోడ్పాటుతో అభివృద్ధి కృషి కొనసాగిస్తామని చెప్పారు.
