ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పని చేస్తా

ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పని చేస్తా

  • 11వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి యేనగందుల అనూష కృష్ణ

జనగామ, ఆంధ్రప్రభ : జనగామ మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పని చేస్తా అని బిఆర్ఎస్ అభ్యర్థి యేనగందుల అనూష కృష్ణ అన్నారు. శనివారం 11 వార్డులోని వివిధ వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి పదవులు లేకున్నా స్వచ్ఛందంగా వార్డు అభివృద్ధితో పాటు వ్యక్తిగత సమస్యలు పరిష్కరించి ముందుకెళ్తున్నామని వారు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్ పార్టీతో పాటు వార్డు ప్రజలు ఎన్నికల బరిలో నిలవాలని కోరడంతో నిలిచానని మీ మద్దతుతో భారీ మెజార్టీ సాధించి రికార్డు నెలకొల్పుతానని అన్నారు.

11వ వార్డులో ప్రజల సమస్యల కోసం ప్రతినిత్యం వార్డులో పర్యటిస్తానని తెలిపారు. గృహ నిర్మాణ పథకం, రేషన్ కార్డులు, పెండింగ్లో ఉన్న పెన్షన్లు, రోడ్ల మరమ్మత్తులు, మురికి కాలువల నిర్మాణం తదితర సమస్యలపై పూర్తి అవగాహన ఉందని వాటి పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని, స్థానిక ఎమ్మెల్యే వార్డు అభివృద్ధికి హామీ ఇచ్చారని తెలిపారు. వార్డు ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు నీలిమ ఆస్పత్రి లో ఏర్పాట్లు చేశారని వారు తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో వార్డు ప్రజలతో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ,యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply