Warangal | గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా

Warangal | గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా

  • కిష్టాపురం నూతన సర్పంచ్ కొండం రంగారెడ్డి
  • పండుగ వాతావరణంలో ప్రమాణ స్వీకారం

Warangal | రాయపర్తి, ఆంధ్రప్రభ : కిష్టాపురం గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి(Development) చేస్తానని ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ కొండం రంగారెడ్డి అన్నారు. సోమవారం గ్రామ పాలకమండలి ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకొని దుర్గమ్మ గుడి నుండి గ్రామపంచాయతీ వరకు అంగరంగ వైభవంగా ర్యాలీ నిర్వహించారు.

తదుపరి గ్రామ ప్రత్యేక అధికారి డాక్టర్ శృతి(Dr. Shruti), గ్రామ కార్యదర్శి లక్ష్మీ ఆధ్వర్యంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేసి ఆయా పదవుల్లో కొలువుదీరారు. అనంతరం నూతన సర్పంచ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నారు. గ్రామానికి వెన్నుదన్నుగా ఉండి ఎల్లవేళలా ఉండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖులు కొండం కృపాకర్ రెడ్డి, టీజీఎన్జీవోస్ ప్రధాన కార్యదర్శి కత్తి రవీందర్, మాజీ సర్పంచులు గట్టు నరసింహచార్యులు, ఎర్రం లలిత శ్రీనివాస్, సంకినేని ఉప్పలమ్మ, గ్రామ పెద్దలు కత్తి సోమయ్య, సజ్జన్, నవీన్, గిద్దే ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply