Warangal | స్థానిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి

Warangal | స్థానిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి

  • పేద‌ల‌కు అండ‌.. కాంగ్రెస్ జెండా

Warangal | పాల‌కుర్తి, ఆంద్ర‌ప్ర‌భ : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ(Congress party) సత్తా చాటాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. ఈ రోజు పాలకుర్తి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని టీపీసీసీ(TPCC) ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి(Jhansi Rajender Reddy)తో కలిసి ప్రారంభించారు. అనంతరం కాంగ్రెస్ జెండా ఎగురువేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జెండా పేదలకు అండగా నిలుస్తుందని అన్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గంలోని అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమ‌న్నారు. పాలకుర్తిలో బిఆర్ఎస్(BRS) ఖాళీ కావడం కాయమన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్లు వస్తాయని కాంగ్రెస్ కార్యకర్త నాయకులు సిద్ధంగా ఉండాలని కోరారు.

Leave a Reply