Warangal | రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజైన కారు..

Warangal | రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజైన కారు..
Warangal, కరిమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ నగరంలోని ఉరుసు బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వర్ధన్నపేట మండల పరిధిలో పని చేస్తున్న 5 గురు ప్రభుత్వ టీచర్లు ఈ రోజు ఉదయం ఓ కారులో డ్యూటీకి వెళ్తుండగా ఉర్సు బైపాస్ రోడ్డులో ప్రమాదం జరిగింది. గణపతి ఇంజనీరింగ్ కాలేజీ దగ్గరకు రాగానే పక్క నుండి గుర్తు తెలియని లారీ ఓవర్ టెక్ చేస్తూ వెళ్తున్న క్రమంలో లారీ వెనుక భాగం కారు ముందు భాగంలో ఢీ కొట్టింది.
దీంతో అదుపు తప్పిన కారు డివైడర్ను ఢీ కొట్టి రోడ్డుకు అటు వైపు పడింది. కారులో ప్రయాణిస్తున్న టీచర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం దాటికి కారు నుజ్జు నుజ్జు అయింది. స్థానికుల సహాయంతో కారులో నుండి వారిని బయటికి తీసి108 వాహనంలో వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో భార్యాభర్తలు కూడా ఉన్నట్లు సమాచారం. మిల్స్ కాలనీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
