వార్ వ‌ర్సెస్ కూలీ


ఆంధ్ర‌ప్ర‌భ, వెబ్ డెస్క్‌: ఆగ‌స్టు 15న దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుక‌ల‌ను ఘ‌నంగా జ‌రుపుకునేందుకు ప్ర‌జ‌లు సిద్ధ‌మ‌వుతుండ‌గా… అదే రోజు సినీ అభిమానులకు మ‌రో పండ‌గ రాబోతోంది. వ‌చ్చే శుక్ర‌వారం బాక్సాఫీస్ వ‌ద్ద రెండు పెద్ద సినిమాలు సంద‌డి చేయ‌డానికి రెడీ అయ్యాయి. ఆ సినిమాలో మరేవో కాదు వార్ 2 (War2) ఒక‌టి కాగా, మ‌రొక‌టి కూలి (Kooli) సినిమా. ఈ రెండు సినిమాలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద రసవత్తరమైన ఫైట్‌కు తెరలేపాయి. ఈ రెండు సినిమాలు భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌డ‌మే కాకుండా, పెద్ద‌పెద్ద స్టార్లు న‌టించారు. ముక్యంగా వార్ సినిమాకు జూనియ‌ర్ ఎన్టీఆర్ (Jr. NTR) హైప్ తీసుకొస్తుండ‌గా… కూలి సినిమాలో ర‌జ‌నీకాంత్‌, నాగార్జున‌, అమీర్‌ఖాన్‌, ఉపేంద్ర త‌దిత‌ర న‌టులు న‌టిస్తుండ‌టంతో ఈ సినిమాకు ఎక్క‌డలేని క్రేజ్ వ‌చ్చింది.


కూలి సినిమాకు మంచి బజ్ ఉన్న విషయం తెలిసిందే. ఇందులో బోలెడు మంది టాప్ స్టార్‌ లు, లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) పేర్లు కలిసి ఆ సినిమాపై క్రేజ్ భారీగా పెంచాయి.తెలుగులో థియేటర్ హక్కులు 42 నుంచి 45 కోట్లు పలుకుతున్నాయి. అయితే ఇటువంటి సమయంలో వార్ 2 సినిమా డేట్ కే కూలి సినిమా కూడా విడుదల డేట్ వేసారు. మరోవైపు వార్ 2 సినిమాపై కూడా భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఎంత హిందీ డబ్బింగ్ అయినా, వార్ 2 సినిమాకు తెలుగు నాట ఓపెనింగ్ ఉంటుంది.ఎందుకంటే అందులో ఎన్టీఆర్ ఒక హీరోగా నటిస్తున్నారు. హృతిక్ రోషన్ (Hrithik Roshan) మరో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా వార్ 2 సినిమా రాబోతోంది. దాంతో తెలుగు నాట కూలి పోటీ పడాలి అంటే అద్భుతమైన టాక్ రావాల్సి ఉంటుంది.ఇప్పటి వరకు పలికిన 42 కోట్ల బేరం ఇకపై పలకడం కష్టమే. ఎందుకంటే ఈ కాంపిటీషన్‌లో రావడం అంటే బిజినెస్ (Business) కు ఎఫెక్ట్ అయిపోతుందని చెప్పాలి. అయితే ఏ సినిమా ఎలా ఉంటుందో అన్నది విడుదలైన తరువాత తెలిసేది.ముందుగా అయితే వార్ 2 కు ఎడ్జ్ ఉంటుంది. కానీ వార్ 2 అన్నది రెగ్యులర్ హెవీ కమర్షియల్ యాక్షన్ ఫార్మాట్‌ లో ఉండవచ్చు.కానీ కూలి అలా కాదు.లోకేష్ కనకరాజ్ టేకింగ్ వేరే లెవెల్‌ లో ఉంటుంది.


త్రిపుల్ ఆర్‌, దేవ‌ర త‌ర‌వాత ఎన్టీఆర్ నుంచి వ‌స్తున్న చిత్రం వార్ 2 సినిమా కాగా, ఇది బాలీవుడ్ తొలి స్ట్రైట్ మూవీ. ఈ చిత్రం కోసం టాలీవుడ్‌తో పాటు బీటౌన్ ప్రేక్ష‌కులు (Beetown audience) ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాకి పోటీగా కూలీ విడుద‌ల కానుండ‌డంతో కాస్త టెన్ష‌న్ నెల‌కొంది. కూలీ సినిమాతో పోలిస్తే ‘వార్ 2’ ప్ర‌మోష‌న్లు అంతగా జ‌ర‌గ‌డం లేదు. ‘కూలీ’ పాట‌లు, ఆ సినిమా పోస్ట‌ర్లు, నాగ్ ఇస్తున్న ఎలివేష‌న్లు అన్ని కూడా కూలీ సినిమాపై అంద‌రి దృష్టి ప‌డేలా చేస్తుంది. వార్ 2 నుండి ఒక్క టీజ‌ర్ మాత్ర‌మే రాగా, దాని వ‌ల‌న పెద్ద‌గా ఒరిగింది ఏమి లేదంటున్నారు. అయితే అంద‌రు వార్ 2 ట్రైల‌ర్ (War 2 trailer) కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ట్రైల‌ర్ అయిన క‌నీసం సినిమాపై అంచ‌నాలు పెంచాలి. మ‌రోవైపు ఎన్టీఆర్, హృతిక్ రోష‌న్ ఈ సినిమాకు మూల స్థంభాలు కాగా, వాళ్లు ఈ చిత్రాన్ని గ‌ట్టిగా ప్ర‌మోట్ చేయాలి.


‘వార్ 2’ తెలుగు రైట్స్ నిర్మాత నాగ‌వంశీ చేతుల్లోకి వెళ్లిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. నాగ వంశీ (Naga Vamsi) ఎన్టీఆర్‌కి ద‌గ్గ‌ర స్నేహితుడు కాగా, ఆయ‌న ఎన్టీఆర్‌ని ప్ర‌మోష‌న్స్ ప‌రంగా ఎలా వాడ‌తాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ‘వార్ 2’ నుంచి పాట‌లు, ప్ర‌మోష‌న్ స్టఫ్ ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు తీయ‌బోతున్నాడ‌ట‌. మ‌రోవైపు తెలుగు నాట ఓ భారీ ఈవెంట్ కూడా నిర్వ‌హించే అవ‌కాశం ఉంది. అయితే కూలీ చిత్రంలో నాగార్జున (Nagarjuna), అమీర్ ఖాన్ (Aamir Khan), ఉపేంద్ర (Upendra) లాంటి స్టార్స్ ఉండ‌డంతో ఈ సినిమాకి దేశ వ్యాప్తంగా క్రేజ్ ల‌భించింది. మ‌రి వార్ 2లో ఇద్ద‌రు టాప్ హీరోస్ ఉన్నారు. దీంతో ఈ సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్ బాగానే ఉన్నాయి. అయితే కూలీకి సౌత్ సినిమా అనే ముద్ర ఉండ‌గా, ‘వార్ 2’కి అలాంటి భ‌యం ఏమి లేదు. అయితే ఈ రెండు సినిమాల మ‌ధ్య పోటీ మాత్రం ఇప్పుడు ఆసక్తిక‌రంగా ఉంటుంది. ఈ ఫైట్‌లో ఎవ‌రు గెలుస్తారు అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.


ఆగస్టు 15 పంద్రాగస్టు కానుకగా రిలీజవుతున్న ఈ రెండు స్టార్ వాల్యూ ఉన్న సినిమాలు కలెక్షన్లపరంగా ఆసక్తిని రేపుతున్నాయి. అయితే ఇప్పటికే ఓవర్సీస్‌లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. ఇంకా వారం రోజులకుపైగా సమయం ఉండగా ఓవర్సీస్‌లో ఈ సినిమాలు కలెక్షన్ల పరంగా ట్రెండ్ సెట్టర్ (trend setter) గా నిలిచేలా కనిపిస్తున్నాయి. నార్త్ అమెరికాతో పాటు యూకే, ఆస్ట్రేలియా, ఇతర దేశాల్లో వార్ 2, కూలీ సినిమాల అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే.. నార్త్ అమెరికాలో కూలీ, వార్ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద నువ్వా? నేనా అనే విధంగా పోటీ పడేందుకు సిద్దమయ్యాయి. అమెరికా (America), కెనడా లో కూలీ చిత్రం ప్రీమియర్ షోకు సంబంధించి 1160 షోలను ప్రదర్శించేందుకు ఏర్పాటు చేయగా.. వార్ 2 సినిమాను 1600 షోలు ప్రదర్శించేందుకు సన్నాహాలు చేశారు. అయితే తక్కువ షోలు ఉన్నప్పటికీ.. ఎన్టీఆర్, హృతిక్ మూవీపై రజనీకాంత్ సినిమా డామినేషన్ ప్రదర్శిస్తున్నది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


కూలీ సినిమాకు సంబంధించి ఇంకా వారం రోజుల వ్యవధి ఉండగానే.. ఈ చిత్రం 45 వేలకుపైగా టికెట్లు నార్త్ అమెరికాలో అమ్మకాలు జరిగాయి. అయితే వార్ 2 సినిమా మాత్రం కేవలం 7 వేల టికెట్లు మాత్రమే అమ్మినట్టు సోషల్ మీడియాలో పలువురు ట్రేడ్ అనలిస్టులు వెల్లడించారు. ఈ చిత్రం ఇప్పటికే నార్త్ అమెరికా (North America) లో 1 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించి.. 2 మిలియన్ డాలర్లు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా కొల్లగొట్టేందుకు రెడీ అవుతున్నది. ఇప్పటికే తమిళ వెర్షన్ (Tamil version), తెలుగు వెర్షన్ టికెట్లు భారీగా అమ్ముడుపోయాయి. ఇక వార్ 2 సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రం 7 వేల టికెట్ల ద్వారా 250K డాలర్లు వసూలు చేసింది. అయితే తెలుగు వెర్షన్ అడ్వాన్స్ బాగానే ఉన్నప్పటికీ.. హిందీ వెర్షన్ ప్రీ సేల్స్ అంతగా లేకపోవడం షాకింగ్‌గా మారింది. ఈ సినిమా కేవలం 5 వేల డాలర్లే వసూలు చేయడం గమనార్హం.

అయితే రానున్న రోజుల్లో హిందీ వెర్షన్ (Hindi version) టికెట్ల అమ్మకాలతోపాటు తెలుగు కూడా భారీగా పెరగాల్సిన అవసరం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. నార్త్ అమెరికా కాకుండా యూకేలో కూలీ సినిమాకు భారీ స్పందన కనిపిస్తున్నది. అయితే యూకేలో ప్రీమియర్లతోపాటు తొలి రోజు కలెక్షన్ల రికార్డు విజయ్ నటించిన లియో సినిమా పేరిట ఉంది. ఈ చిత్రం 576000 పౌండ్లు వసూలు చేసింది. అయితే కూలీ చిత్రం ఈ రికార్డును బ్రేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు (Trade categories) అంచనా వేస్తున్నారు. మలేషియా, గల్ఫ్, సింగపూర్ (Singapore) ఇతర దేశాల్ల ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రికార్డు స్థాయిలో కొనసాగుతున్నది. కూలీ మూవీ ఫస్ట్ రివ్యూ ఆస్ట్రేలియాలో ఈ సినిమా 12 వేల టికెట్లు, మలేషియాలో 25 వేల టికెట్లు, యూకేలో 22 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇక గల్ఫ్, యూఏఈలో టికెట్ల అమ్మకాల జోరు కొనసాగుతున్నది. ఈ సినిమా రిలీజ్ డే నాటికి సుమారుగా 6 మిలియన్ డాలర్లు వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Leave a Reply