Wage rates | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి వ్యవసాయ పరిశోధన కేంద్రంలో కూలి రేట్లు పెంచాలని కోరుతూ శుక్రవారం వ్యవసాయ పరిశోధన అధికారికి వినతి అందజేసినట్లు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బి కదిరప్ప(Kadirappa) తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం శ్రీ సత్య సాయి జిల్లా సమితి ఆధ్వర్యంలో కదిరి ప్రాంతం టౌన్లో వ్యవసాయ కూలీల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. కదిరి నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో జీవనోపాధి(Livelihood) కోసం అవకాశాలు తగ్గిపోవడంతో పెద్ద సంఖ్యలో కూలీలు వ్యవసాయ పరిశోధన శాఖలో డైలీ-వేజ్ పద్ధతిలో పనిచేస్తున్నారన్నారు.
కానీ ఈ కూలీలకు ఇచ్చే రోజువారీ వేతనం ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరలకు, ద్రవ్యోల్బణానికి, జీవన వ్యయానికి పూర్తిగా అనుగుణంగా లేవన్నారు. ఫలితంగా రోజువారీ కూలీలకు గిట్టుబాటు(availability) లేక జీవనం దెబ్బతింటోందన్నారు. ఈ పరిస్థితిని పరిశీలించిన బి.కదిరప్ప వ్యవసాయ పరిశోధన అధికారికి, కూలీల తరఫున కింది డిమాండ్లు స్పష్టంగా విన్నవించారు. కార్యక్రమంలో సిపిఐ ఆదినారాయణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బ్రహ్మయ్య, చరణ్,సుధాకర్, చెన్నకేశవులు, బాలకృష్ణ, వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు.

డిమాండ్లు ఇవే..
- డైలీ వేజ్ రేట్లు తక్షణమే పెంచాలి.
- ద్రవ్యోల్బణం, మార్కెట్ రేట్లు పరిగణనలోకి తీసుకుని న్యాయమైన కూలి నిర్ణయించాలి.
- కూలీలు నిరంతరం శ్రమిస్తున్నందున పని భద్రతా చర్యలు, కనీస సౌకర్యాలు అందించాలి.
- పరిశోధన కార్యకలాపాల్లో కూలీల పాత్ర కీలకమైనందున వారి హక్కులు, గౌరవం కాపాడే విధానాలు అమలు చేయాలి.


