Vuyyuru | అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

Vuyyuru | అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

  • 12 లక్షల విలువైన బంగారం స్వాధీనం

Vuyyuru | ఉయ్యూరు, ఆంధ్రప్రభ : గత నెలలో ఉయ్యూరు మార్కెట్ సెంటర్ సమీపంలోని శ్రీకృష్ణ సాయి జ్యువెలర్స్ షాప్‌లో దొంగతనానికి పాల్పడి సుమారు 80 గ్రాముల బరువైన 35 జతల చెవి దిద్దులను ఎత్తుకెళ్లిన గొర్రెల సత్యనారాయణను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఐ – భీమవరం ప్రాంతంలో మార్కెట్ యార్డు సమీపంలో అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 30 జతల చెవి దిద్దులను, 12 చిన్న ఉంగరాలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు సమయంలో అతనితోపాటు చోరీ వస్తువులు కొనడానికి వచ్చిన కంచర్ల సాయి సుధీర్ నల్లచెరువు గుంటూరులో అరెస్ట్ చేయడం జరిగింది.

గన్నవరం డీఎస్పీ చలసాని శ్రీనివాస్ తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. ప‌శ్చిమగోదావరి జిల్లా భీమవరంకు చెందిన గొర్రెల సత్యనారాయణ చిన్నతనం నుంచి విలాసాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. ఇతనిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోనే పదుల సంఖ్యల జిల్లాలలో 30కి పైగా కేసులు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. గొర్రెల సత్యనారాయణ అనే వ్యక్తి మీద కృష్ణాజిల్లా, గన్నవరం పోలీస్ స్టేషన్‌లో కూడా దొంగతనం కేసు ఉంది.

ఇతను కేవలం బంగారం షాపులోనే దొంగతనం చేయ‌డ‌మే టార్గెట్‌గా పెట్టుకుంటాడు. యజమానులు భోజనం చేసే టైంలో వాళ్ళని అటెన్షన్ డైవర్ట్ చేసి అక్కడ అరలో ఉన్న జువెలరీ బాక్సులను తనతో తెచ్చుకున్న కర్రల బ్యాగులో పెట్టుకుని క్షణాలలో అక్కడ నుండి మాయమవడం ఇతనికి అలవాటు. అలా చోరి చేసిన సొమ్మును అమ్ముకొని విలాసాలు చేస్తూ ఉంటాడు. అదే క్రమంలో గత నెలలో ఉయ్యూరు షాపులో దొంగతనానికి పాల్పడగా సీసీ కెమెరాలు ద్వారా అతనిని గుర్తించి నిఘా ఉంచి పట్టుకోవడం జరిగింది.

బంగారం వర్తకులు అందరికీ ఇది ఒక హెచ్చరిక లాంటిది. భోజనానికి వెళ్ల సమయంలో షాపు వదిలి పెట్టకూడదని అలానే షాపులోని అరలకు సరైన లాక్ సిస్టం ఉండాలని సీసీ కెమెరాలు కూడా లోపల బయట కవర్ అయ్యేలా చూసుకోవాలని గన్నవరం డీఎస్పీ చలసాని శ్రీనివాస్ తెలియజేశారు. ఈ కేసు ఛేద‌నలోను, ముద్దాయిలను పట్టుకొని రికవరీ చేయడంలోనూ కీల‌క పాత్ర పోషించిన సీసీఎస్ సీఐ గోవిందరాజుని, ఉయ్యూరు పట్టణ సీఐ రామారావును అలాగే సిబ్బందిని ఆయన అభినందించారు.

Leave a Reply