Voters | గ్రామానికి సేవ చేసే అవకాశం ఇవ్వండి

Voters | గ్రామానికి సేవ చేసే అవకాశం ఇవ్వండి

Voters | ధర్మపురి, ఆంధ్రప్రభ : గ్రామ ప్రజలు తనకు ఒకసారి సర్పంచ్ గా గెలిపించి గ్రామానికి సేవ చేసే అవకాశం ప్రజలు కల్పించాలని దొంతపూర్ సర్పంచ్ అభ్యర్థి సుద్దాల స్వరూప లక్ష్మణ్ ఓటర్ల(voters)ను అభ్యర్థించారు.

శుక్రవారం రోజున గ్రామంలోని వివిధ వార్డులలో తిరుగుతూ ఇంటింటా ప్రచారం చేస్తూ కత్తెర గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీ(majority)తో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రతినిత్యం గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఒక్కసారి ప్రజలు దీవించి తనను గెలిపించాలని ఆమె కోరారు.

Leave a Reply