Voters | నందిగామలో ప్రశాంతంగా పోలింగ్

Voters | నందిగామలో ప్రశాంతంగా పోలింగ్

  • 18 పంచాయతీల్లో భారీ భద్రత

Voters | నందిగామ, ఆంధ్రప్రభ : రంగారెడ్డి జిల్లా పరిధిలోని నందిగామ మండలంలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఈరోజు ఉదయం ప్రశాంతంగా ప్రారంభమై కొనసాగుతోంది. మండలంలోని మొత్తం 18 గ్రామ పంచాయతీల్లో(In 18 village panchayats) సర్పంచులు, వార్డు సభ్యులు ఎన్నికల కోసం ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

ఎన్నికలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా జిల్లా యంత్రాంగం(District Administration) పటిష్ట ఏర్పాట్లు చేసింది. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు భారీగా మోహరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ సిబ్బంది ప్రత్యేక పర్యవేక్షణలో ఉన్నారు. ఎన్నికల ప్రక్రియ(Election process) పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ శాతం వివరాలు తెలిసే అవకాశముంది.

Voters

Leave a Reply