Voters | సర్ పెను ప్రభావం..

Voters | సర్ పెను ప్రభావం..

Voters | హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో రాష్ట్రేతర ఓటర్లకు చెక్ పడబోతున్నది. ఇక పై నకిలీ ఓట్లు, రెండు రాష్ట్రాల్లో ఓటు, ఒకే రాష్ట్రంలో రెండు మూడు చోట్ల ఓటు హక్కు పై సర్ పెను ప్రభావం చూపనుందని తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో రాష్ట్రేతరులు, ప్రధానంగా ఏపీ ఓటర్లు (Ap Voters) కీలకంగా మారి కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములను డిసైడ్ చేసే స్థాయికి చేరుకున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ బెడద తీవ్రంగా ఉంది. సర్ ప్రక్రియతో ఇలాంటి సమస్యకు చెక్ పడనుందని అధికారులు అంటున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలో వేర్వేరు సమయాల్లో ఎన్నికలు జరిగేవి. కొందరు రెండు చోట్ల ఓట్లు వేసేవారు. 2004, 2009 లో తెలంగాణతో పాటు, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఓసారి, ఆంధ్రలోని మిగిలిన ప్రాంతాలకు, రాయలసీమతో కలిపి మరోసారి ఎన్నికలు జరిగాయి. 2014లో తెలంగాణ జిల్లాల్లో ఎన్నికలు ముగిసిన వారం రోజుల అనంతరం ఆంధ్ర, రాయలసీమల్లో ఎన్నికలు జరిగాయి.

Leave a Reply