అభయమిస్తున్న హస్తానికి ఓటేయండి..

పాల్వంచ, ఆంధ్రప్రభ : అభయమిస్తున్న అసానికి ప్రతి ఒక్కరు ఓటు వేసి గెలిపించండి డివిజన్ అభివృద్ధిని చేసుకుందామని 48వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రామచంద్రనాయక్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన 48వ డివిజన్ లో విస్తృతంగా పర్యటించి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నవ్వుతూ పలకరిస్తూ ఓటర్లకు భరోసాన్ని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలను వివరిస్తూ డివిజన్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే మరింత నిధులతో అభివృద్ధిని చేరవేగంగా చేయవచ్చని సూచించారు. కొత్తగూడెం కార్పొరేషన్ లో ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంటుందని అందులో తను ముందే ఉంటామన్నారు. డివిజన్లోని ప్రతి సమస్య తనకు తెలుసు ప్రతి ఒక్కటిని పరిష్కారం మార్గం చూపే సత్తా తమలో ఉందని నమ్మకంతో ప్రతి ఒక్కరు పట్టం కట్టాలని ఐదు సంవత్సరాలు అండగా నిలబడి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానన్నారు. అడుగడుగునా డివిజన్లో ప్రచారం భాగంగా ఘనస్వాగతం పలకటం సంతోషకరంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జ్ లావుడ్య పూర్ణ, అశ్వాపురం సర్పంచ్ సదర్ లాల్, నాయకులు ఖాదర్, రమేష్ తదితరులు ఉన్నారు.

Leave a Reply