Vote | కుటుంబ సమేతంగా..

Vote | కుటుంబ సమేతంగా..
- ఓటేసిన మాజీ ఎమ్మెల్యే దంపతులు
Vote | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : కోయిల్‌కొండ మండలం శేరివేంకటాపూర్ గ్రామంలో మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షులు యస్. రాజేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సొంత గ్రామంలో స్వయంగా పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేసిన ఆయన, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు విలువ ఎంత గొప్పదో ప్రజలకు చాటిచెప్పారు. నాయకులు మాత్రమే కాకుండా ప్రతి పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్య బలపడుతుందనే సందేశాన్ని ఇచ్చారు.
