Vote | అవినీతి లేని పాలన అందిస్తా..

Vote | తలమడుగు, ఆంధ్రప్రభ : అవినీతి లేని పాలన అందిస్తా.. పార్టీలకతీతంగా గ్రామాభివృద్ధికి సేవకుడిగా పని చేస్తా.. ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి.. ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఝరి గ్రామ సర్పంచ్ అభ్యర్థి మేస్రం రూప కాశీరాం గ్రామ ప్రజలను కోరారు. శుక్రవారం గ్రామంలో గడపగడపకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఒక్కొక్కరికి ఉంగరాన్ని బహుకరించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మేస్రం రూప కాశిరం మాట్లాడుతూ.. గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని.. అలాగే ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులే కాకుండా ఎంపీ గోడం నగేష్ ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రతి వీధిలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి డ్రైనేజీలను ఎప్పటికప్పుడు పరిశుభ్రపరుస్తూ మూడు నెలలకు ఓసారి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయిస్తానన్నారు. ఒక్కసారి ఆశీర్వదించి గెలిపిస్తే.. గ్రామాన్ని అభివృద్ధిలో ఆదర్శవంతంగా తీర్చిదిద్ది సేవకుడిగా పని చేస్తానన్నారు. ఆమె వెంట మద్దతుదారులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply