VOTE | కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి
కాంగ్రెస్ మండల నాయకులు పొనుగోటి రవీందర్
VOTE | ఆంధ్రప్రభ, మల్లంపల్లి : కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వార్డు మెంబర్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మల్లంపల్లి కాంగ్రెస్ మండల నాయకులు పోనుగోటి రవీందర్ అన్నారు. ఈ మేరకు బుధవారం మల్లంపల్లి గ్రామంలో మూడు, నాలుగు, ఐదవ వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా అభ్యర్థుల గుర్తులను ప్రజలకు వివరిస్తూ తమ అమూల్యమైన ఓటును వేసి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఆయా వార్డుల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి తాము నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందేలా చూస్తామన్నారు. ఎవరు కూడా అధైర్య పడవద్ధని, ఏ సమస్యలున్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మూడో అవార్డు అభ్యర్థి మోసిన్, నాల్గవ వార్డు అభ్యర్థి జింక వేణు, ఐదో వార్డు అభ్యర్థి పాలపర్తి రమాదేవి హనుమంతు, జింక హైమ, గాజు అరుణ, లక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు.

