విజయనగరం – ఓ విద్యార్థిని ఏకంగాలెక్చరర్ పై చెప్పుతో దాడి చేసిన ఘటన ఏపీలో కలకలం సృష్టిస్తోంది.. అంతేకాదు.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. లెక్చరర్ తన సెల్ ఫోన్ తీసుకున్నరని ఓ విద్యార్థిని ఏకంగా చెప్పుతో కొట్టింది. ఈ విచారకరమైన ఘటన విశాఖ, విజయనగరం మధ్య దాకమ్మరిలో ఉన్న ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో చోటు చేసుకుంది. ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ లెక్చరర్ కంట పడింది. వెంటనే లెక్చరర్ ఆ విద్యార్థిని సెల్ ఫోన్‌ను తీసుకున్నారు. అంతే విద్యార్ధిని కోపం నసాలనికెక్కింది. చదువు చెప్పిన లెక్చరర్ అని మరిచి అక్రోషంతో అంతటి గౌరవ ప్రథమైన టీచని చెడా మడా తిట్టేసింది.
అక్కడితో ఆగలేదు.. తన కాళ్లకి వేసిన చెప్పు తీసి.. ఆ చెప్పుతో చెప్ప చెల్లుమనుపించింది విద్యార్థిని. ఇది చూసిన తోటి విద్యార్థులు సైతం విడిపించే ప్రయత్నం చేసినా.. ఆ విద్యార్థిని వెనుక్కి తగ్గలేదు కాదా.. ముష్టి యుద్ధానికి దిగింది.. ఇదంతా చూసిన వారు ఒక్కింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదేమి విష సంస్కృతి అని తోటి లెక్చరర్ ముక్కున వేలేసుకుంటున్నారు.. అయితే, ఈ దృశ్యాలను ఓ విద్యార్థి తన మొబైల్‌లో చిత్రీకరించడంతో.. అది కాస్తా ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది..