( ఆంధ్రప్రభ, గుంటూరు బ్యూరో): గుంటూరు(Guntur) జిల్లా తాడేపల్లి(Tadepalli)లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం విశ్వకర్మ(Vishwakarma) జయంతిని ఘనంగా నిర్వహించారు. భగవాన్‌ విశ్వకర్మ, గాయత్రీ మాత చిత్రపటాలకు పూలమాల వేసి మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) నమస్కరించారు. కార్మికులు, శిల్పులు, వడ్రంగులు, శ్రామిక వర్గాల ఆరాధ్య దేవుడు విశ్వకర్మ స్పూర్తితో పనిలో నైపుణ్యం పెంచుకోవాలని జగన్ మోహన్ రెడ్డి కోరారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు రమేష్‌ యాదవ్‌, లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే విరూపాక్షి, వైసీపీ నాయకులు పవిత్ర మురళీకృష్ణ, తోలేటి శ్రీకాంత్‌, ఉదయ్‌, అంకంరెడ్డి నారాయణమూర్తి, మల్లికార్జున్‌, బ్రహ్మం పాల్గొన్నారు.

Leave a Reply