Visakhapatnam | మద పిచ్చి భర్త వేధింపులతో నవ వధువు ఆత్మహత్య
విశాఖపట్నంలో ఘటన
రోజు అశ్లీల వీడియోలు చూపిస్తూ వేధింపులు
పెద్దలకు చెప్పిన పరిష్కారం కాని సమస్య
ఇక తట్టుకోలేక నవ వధువు బలవన్మరణం
విశాఖలో దారుణ ఘటన వెలుగుచూసింది. భర్త టార్చర్ తాళలేక నవవధువు వసంత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గోపాలపట్నం నందమూరి కాలనీలో చోటుచేసుకుంది. అశ్లీల వీడియోలు చూపించి తీవ్రంగా టార్చర్ చేశాడు భర్త నాగేంద్రబాబు. దీంతో తట్టుకోలేక ఊరివేసుకుంది వసంత. నాగేంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే భర్తే హత్య చేశాడని వసంత కుటుంబం ఆరోపిస్తుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తన భర్త నాగేంద్రబాబు అశ్లీల వీడియోలు చూపిస్తూ టార్చర్ చేస్తున్నాడని కుటుంబ సభ్యుల దగ్గర వాపోయింది. కొన్ని రోజులుగా ఈ సమస్యను తమ ముందు చెబుతోందన్నారు కుటుంబ సభ్యులు. గత రాత్రి కూడా ఫోన్ చేసిందని అయితే రేపు వచ్చి మాట్లాడాతామని చెప్పామన్నారు. ఇంతలోనే వారి కుటుంబ సభ్యులు ఫోన్ చేసి ఆమె చనిపోయిందని చెప్పారంటున్నారు.. అయితే ఇది ఆత్మహత్య కాదని.. హత్య అంటూ ఆరోపిస్తున్నారు మృతురాలి బంధువులు.