Visakha | బీచ్ రోడ్ లో ఘ‌నంగా యోగాంధ్ర‌

విశాఖ‌ప‌ట్నం : కేంద్ర ఆయూష్ శాఖ (Union Ministry of AYUSH) ఆధ్వర్యంలో విశాఖలోని బీచ్ రోడ్ లో యోగాంధ్ర ఘ‌నంగా నిర్వ‌హించారు. వాకథాన్ (Walkathon) ముగిసిన అనంతరం విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడ మంత్రులు, అధికారులు ప్రజలతో కలిసి వివిధ యోగాసనాలను వేశారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుందని, ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ‘యోగాంధ్ర’ లక్ష్యాలను ప్రజలకు మరింత చేరువ చేసిందని నిర్వాహకులు భావిస్తున్నారు.

ఈ యోగాంధ్ర కార్యక్రమంలో విశాఖ జిల్లా (Visakha District) ఇన్ ఛార్జ్ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, సవిత, ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడుతో కలిసి నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పాల్గొని యోగాసనాలు వేశారు.

విశాఖలో అన్ని స్కూళ్లకు రెండు రోజులు సెలవు : డీఈవో
అంతర్జాతీయ యోగా దీనోత్సవరం (International Yoga Day) సందర్భంగా విశాఖలోని అన్ని స్కూళ్లకు ఈనెల‌ 20, 21వ తేదీల్లో సెలవులు (holidays) ఇస్తున్నట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ రెండు రోజులు ప్రతి స్కూల్లో విద్యార్థులకు యోగాసనాలపై శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రైవేట్, గవర్నమెంట్ స్కూళ్లో విధిగా ఉత్తర్వులు అమలు చేయాలని ఆదేశించారు.

Leave a Reply