Virat Kohli | ఒకే ఒక్క‌డు… కోహ్లీ ఖాతాలో అరుదైన రికార్డ్ !

కోల్‌క‌తాతో నేడు జ‌రుగుతున్న మ్యాచ్ లో ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ ఓ మ‌లైరాయిని చేరుకున్నాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో కోహ్లీ ధ‌నాధ‌న్ బౌండ‌రీల‌తో 23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సుల‌తో 38 ప‌రుగులు చేసిన కోహ్లీ.. కోల్‌క‌తాపై 1000 పరుగులు సాధించిన మూడో బ్యాట‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు.

ఇప్పటివరకు కేకేఆర్ తో జరిగిన 31 ఇన్నింగ్స్‌ల్లో 10.11 సగటుతో కోహ్లీ 962 పరుగులు చేశాడు, అందులో ఒక సెంచరీ, ఆరు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయితే, ఈరోజు జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాపై కోహ్లీ 38 పరుగులు చేసి 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.

ఇక కేకేఆర్ పై అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఆట‌గాళ్ల జాబితాలో డేవిడ్ వార్న‌ర్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. వార్న‌ర్ 28 ఇన్నింగ్స్‌ల్లో 43.72 స‌గ‌టుతో 1,093 ప‌రుగులు చేశాడు. రెండో స్థానంలో ముంబై ఇండియ‌న్స్ స్టార్ ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ ఉన్నాడు. హిట్‌మ్యాన్ 34 ఇన్నింగ్స్‌ల్లో 39.62 స‌గ‌టుతో 1,070 ప‌రుగులు చేశాడు.

నేటి మ్యాచ్ తో కోహ్లీ నాలుగు వేర్వేరు జట్లపై వెయ్యికి పైగా పరుగులు సాధించాడు. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లపై 1000కి పైగా ర‌న్స్ చేశాడు. మరే ఆటగాడు కూడా రెండుకంటే ఎక్కువ జట్లపూ వెయ్య పరుగులు చేయలేదు. దీంతో నాలుగు వేర్వేరు జట్లపూ వెయ్యి పరుగులు సాధించిన ఒకేఒక్కడిగా విరాట్ నిలిచాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *